సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన ఆర్టీసీ కండక్టర్ ఆంజనేయులు... రోజువారీ కూలీ పనికి వెళ్తున్నాడు. రెండు నెలలుగా జీతాలు లేక ఇళ్లు గడవటం కష్టంగా మారిందని... అందుకోసమే వడ్రంగి దుకాణంలో కూలీ పనికి వెళ్తున్నాని చెబుతున్నాడు. సమ్మెలో పాల్గొంటూనే కూలీ పనికి వెళ్తున్నట్లు అంజనేయులు చెప్పుకొచ్చాడు. జీతాలు లేక కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం కార్మికులను చర్చలకు పిలిచి న్యాయం చేయాలని కోరాడు.
- ఇదీ చూడండి: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు!