ETV Bharat / state

'కేంద్రం పైసలిస్తనంటే కేసీఆర్ వద్దన్నడు.. జగన్​ ఆశపడ్డడు'

author img

By

Published : Sep 22, 2020, 4:57 PM IST

కేంద్ర ప్రభుత్వం రైతులను తీవ్ర అన్యాయానికి గురిచేస్తోందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రైతులను నష్టానికి గురి చేసే బిల్లులను ప్రవేశపెట్టిందన్నారు. 'ఇటీవల జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో బోర్లు, బావులకు మీటర్లు పెడితే డబ్బులు ఇస్తామన్నారు. మన కేసీఆర్ రైతులు గురించి ఆలోచించి వద్దు అన్నాడు. పక్కనున్న జగన్మోహన్ రెడ్డి ఆశపడి పైసలు తీసుకుని మోటర్లు పెడుతున్నారు' అన్నారు.

minister-harish-rao-comments-on-ap-cm-jaganmohan-reddy-on-electricity-meters
'మన కేసీఆర్ వద్దు అన్నాడు... ఏపీ సీఎం ఆశపడ్డాడు'

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పద్మనాభునిపల్లి గ్రామంలో జరిగిన ఏకగ్రీవ తీర్మానం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రామస్థులంతా తెరాసను గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి వ్యాఖ్యానించారు.

''ఇటీవల మా ఆర్థిక మంత్రులకి మీటింగ్ అయింది. మీకు రూ.2,500 కోట్లు కావాలంటే... బావులు, బోర్ల వద్ద మీటర్లు పెట్టండి అన్నారు. పెట్టాల్నా మరీ..? పెట్టి 2,500 కోట్ల రూపాయలు తెచ్చుకోవాల్నా? అదే మన పక్కన ఆంధ్రప్రదేశ్​లో సీఎం జగన్​మోహన్ రెడ్డికి రూ.4,000 కోట్లు ఆఫర్ ఇచ్చారు. పోయిండు. నాలుగు వేల కోట్లు తెచ్చుకున్నడు. మీటర్లు పెడుతున్నడు.''

-మంత్రి హరీశ్ రావు

మన సీఎం కేసీఆర్ మాత్రం కేంద్రం ఇచ్చిన ఆఫర్ వద్దని రైతుల క్షేమమే ముఖ్యమన్నారని హరీశ్​రావు తెలిపారు. మా రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు. నీ కోట్లు వద్దు... మీ మీటర్లు వద్దని కేసీఆర్ అన్నారని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: 'అబద్ధాలు చెప్పి ప్రజలను భ్రమపెట్టేది భాజపా ఎంపీలే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.