మొక్కజొన్న పంటను మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో అన్నదాతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల దళారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందని ఆరోపించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ రైతులతో సంప్రదింపులు జరిపారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: విత్తనాలు నాటుకునే శుభలేఖలు.. పర్యావరణ హితంగా కళ్యాణం..