ETV Bharat / state

ఇవాళ గజ్వేల్​లో పర్యటించనున్న ముఖ్యమంత్రి

సీఎం కేసీఆర్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. ములుగులో కొలువు తీరిన ఉద్యాన విశ్వ విద్యాలయం, అటవీ కళాశాల, సమీకృత మార్కెట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ఉద్యానవనాల అభివృద్ధి, పరిశోధన కోసం ములుగులో ఏర్పాటుచేసిన హర్టికల్చర్ యూనివర్సిటీ భవనాన్ని కూడా... ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్, హరీశ్‌ రావు వెళ్లనున్నారు.

cm kcr visit gajwel constituency today
నేడు గజ్వేల్​లో పర్యటించనున్న ముఖ్యమంత్రి
author img

By

Published : Dec 11, 2019, 6:07 AM IST

Updated : Dec 11, 2019, 6:16 AM IST

నేడు గజ్వేల్​లో పర్యటించనున్న ముఖ్యమంత్రి

రాష్ట్రంలో ప్రతిష్టాత్మక శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, సెంటర్‌ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఉద్యాన పంటల సాగు,విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా... సిద్ధిపేట జిల్లా ములుగులో కొలువు తీరిన ఉద్యాన విశ్వవిద్యాలయం, అనుబంధంగా అత్యుత్తమ పండ్ల పరిశోధన సంస్థ ప్రారంభం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలో నాలుగో ఉద్యాన విశ్వవిద్యాలయంగా ములుగులో కొలువుదీరిన వర్శిటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు తర్వాత రాష్ట్రంలోనే ఉద్యాన విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. మొత్తం 53 ఎకరాల విస్తీర్ణంలో 22 కోట్ల రూపాయల వ్యయంతో నూతన హార్టికల్చర్‌ వర్శిటీ నిర్మించారు. 30 ఎకరాల విస్తీర్ణంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేసి పలు రకాల పండ్ల మొక్కలపై పరిశోధన చేయనున్నారు. మామిడి, జామ, దానిమ్మ, బొప్పాయి, చింత, ఉసిరి తదితర 49 రకాల పండ్ల మొక్కలతోపాటు చందనం, వెదురు మొక్కలు పెంచనున్నారు.

సమీకృత విపణులకు శ్రీకారం

గజ్వేల్ స్ఫూర్తిగా రాష్ట్రంలో సమీకృత విపణులకు శ్రీకారం చేపట్టిన ప్రభుత్వం... ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. ఈ మార్కెట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆరు బ్లాకుల్లో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభించనున్నాయి. 16 వాణిజ్య దుకాణాలు, సూపర్ మార్కెట్, పిల్లలకు కోసం ఉద్యానవనం ఏర్పాటు వల్ల అహ్లాదకరంగా మార్కెట్ ప్రాంగణం దర్శనమిస్తోంది.

రైతులు ఆత్మగౌరవంతో బతకాలనే లక్ష్యంతో

రెండేళ్లుగా ఉద్యాన విశ్వవిద్యాలయం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ రూపుదిద్దేందుకు అధికారులు ఎంతో కృషి చేశారు. ఉద్యాన రంగంలో శాస్త్ర, సాంకేతికత పెంపొందించేందుకు ఇది దోహదపడనుంది. రైతుల ఆర్థికాభివృద్ధికి, సాంకేతిక శిక్షణకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇక్కడ సమకూర్చారు. రైతు ఆత్మగౌరవంతో బతకాలి అనే సంకల్పంతో సాగు రంగంపై ప్రత్యేక దృష్టిసారించిన సర్కార్‌... ఉద్యానపంటల పరిశోధన, సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపొందిచేందుకు అనేక చర్యలు చేపట్టింది. పండ్ల తోటల సాగు, విస్తీర్ణం, దిగుబడుల పెంపు లక్ష్యంతో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మితమైంది.

రైతులకు తోటల పెంపకంలో శిక్షణ

రైతులకు పండ్ల తోటల పెంపకంపై మేలైన శిక్షణ, నాణ్యమైన పండ్ల మొక్కల అంట్లను తయారుచేసి అందజేయాలనేది లక్ష్యంగా పనిచేయనుంది. దేశవ్యాప్తంగా అరుదైన పండ్ల మొక్కలు సేకరించి ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. 30 ఎకరాల ప్రదర్శన క్షేత్రంలో 11 ప్రధాన పంటలకు సంబంధించి 52 జాతులకు చెందిన 18 వేల మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారంలా 42 వేల మొక్కలు నాటడం విశేషం. ఏటా 80 లక్షల కూరగాయల నారు మొక్కలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల ప్లగ్ టైప్ నర్సరీకి ఐదున్నర కోట్లు ఖర్చు పెట్టారు.

విదేశాలకు ఎగుమతి చేయడమే లక్ష్యం

రాబోయే రోజుల్లో ఉద్యాన పంటల సాగు కొత్త ఒరవడి సంతరించుకోనున్న దృష్ట్యా విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి రైతులకు కాసుల పంట పండనుంది. అమెరికా, ఇజ్రాయెల్‌, జర్మనీ టెక్నాలజీ అందిపుచ్చుకుని పండ్లు, కూరగాయల పంటల సాగులో స్వయం సమృద్ధి సాధించి విదేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేయాలనేది లక్ష్యం.

ఇవీ చూడండి: నేడు స్వచ్ఛగ్రామం కాసులపల్లిని సందర్శించనున్న గవర్నర్​

11-12-2019 TG_HYD_03_11_SKLTSHU_COE_CM_LAUNCH_CURTAINRAISER_PKG_3038200 REPORTER : MALLIK.B Note : సంగారెడ్డి నుంచి నిన్న, ఈరోజు వచ్చిన ఫీడ్ వాడగలరు. ( ) ఉద్యాన రైతులు, ఔత్సాహికపారిశ్రామికవేత్తలు, విద్యార్ధులకు శుభవార్త. భారత ఉద్యాన భాండాగారంగా అవతరించిన తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయం, సెంటర్ అఫ్ ఎక్సలెన్స్‌ - పండ్లు పరిశోధన కేంద్రం కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. సిద్ధిపేట జిల్లాలో జాతీయ రహదారిపై హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ములుగు వద్ద 53 ఎకరాల విస్తీర్ణంలో కొలువు తీరిన శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం, అనుబంధంగా పక్కనే అత్యుత్తమ పండ్ల పరిశోధన కేంద్రంను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన సర్కారు... ప్రత్యేకించి ఉద్యానపంటల పరిశోధన, సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపొందిచేందుకు చర్యలు తీసుకొంటోంది. LOOK........ VOICE OVER - 1 రాష్ట్రంలో ప్రతిష్టాత్మక శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, మరో సెంటర్‌ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఉద్యాన పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా... సిద్ధిపేట జిల్లా ములుగులో కొలువు తీరిన ఉద్యాన విశ్వవిద్యాలయం, అనుబంధంగా అత్యుత్తమ పండ్ల పరిశోధన సంస్థ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తద్వారా నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. రాష్ట్రానికి ఇవి ఒక వరం లాంటివి. దేశంలో నాలుగో ఉద్యాన విశ్వవిద్యాలయంగా ఖ్యాతిగాంచింది. హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడుల తర్వాత తెలంగాణలో సీఓఈ ఏర్పాటైంది. మొత్తం 53.25 ఎకరాల విస్తీర్ణంలో 22 కోట్ల రూపాయల వ్యయంతో నూతన ఉద్యాన విశ్వవిద్యాలయం కొలువు తీరింది. అందులో 30.01 ఎకరాల విస్తీర్ణం సీఓఈ ఏర్పాటు చేసి పలు రకాల పండ్ల మొక్కలపై పరిశోధనకు అంకురార్పరణ చేయనుంది ఉద్యాన శాఖ. మామిడి, జామ, దానిమ్మ, బొప్పాయి, చింత, ఉసిరి తదితర 49 రకాల పండ్ల మొక్కలుతోపాటు చందనం, వెదురు మొక్కలు ఇప్పటికే చేపట్టింది. గజ్వేల్ స్ఫూర్తిగా రాష్ట్రంలో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చెట్టిన ప్రభుత్వం... 6.24 ఎకరాల విస్తీర్ణంలో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టింది. ఈ మార్కెట్‌ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 6 బ్లాకులలో అన్ని రకాల కూరగాయలు, పండ్లు, మాంసాహారం లభించడంతోపాటు 16 వాణిజ్య దుకాణాలు, 1 సూపర్ మార్కెట్, పిల్లలకు కోసం ఉద్యాన వనం ఏర్పాటు మూలంగా అహ్లాదకరంగా మార్కెట్ ప్రాంగణం దర్శనమిస్తోంది. ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం, అత్యుత్తమ పరిశోధన సంస్థ, గజ్వేల్ సమీకృత మార్కెట్‌ను మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. గత రెండేండ్లుగా ఉద్యాన విశ్వవిద్యాలయం, ఈఓఈ రూపుదిద్దుకునేందుకు కృషి చేసిన అధికారులకు మంత్రులు అభినందనలు తెలియజేశారు. ఉద్యాన రంగంలో శాస్త్ర, సాంకేతికత పెంపొందించేందుకు ఇదొక ముందడుగు అని... రైతుల ఆర్థికాభివృద్ధికి, సాంకేతిక శిక్షణకు తోడ్పడుతుందని భరోసా ఇచ్చారు. రైతు ఆత్మగౌరవంతో బతకాలి... రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తుంటారని... ఈ విశ్వవిద్యాలయానికి జాతీయ, అంతర్జాతీయ హోదా కోసం కృషి చేస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. VOICE OVER - 2 రాష్ట్రంలో పండ్ల తోటల సాగు, విస్తీర్ణం, దిగుబడుల పెంపు లక్ష్యంతో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు రాజేంద్రనగర్‌లో తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్న శ్రీకొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంకు శాశ్విత ప్రాతిపదికన ములుగు వద్ద ప్రతిష్టాత్మక సీఓఈ ఏర్పాటైంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మితమైంది. రైతులకు పండ్ల తోటల పెంపకంపై మంచి శిక్షణ ఇచ్చి మేలైన పండ్ల మొక్కలు అంట్లను తయారుచేసి అందజేయాలనేది లక్ష్యం. దేశవ్యాప్తంగా అరుదైన పండ్ల మొక్కలు సేకరించి ఈ సీఓఈలో ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు. పండ్ల తోటల సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో తెలంగాణ రైతులకు పరిచయం చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. మొత్తం 9 రకాల బహు వార్షిక పండ్ల తోటలపై ఉద్యాన శాఖ దృష్టి కేంద్రీకరించింది. మామిడి, బత్తాయి, జామ, దానిమ్మ, సీతాఫలం, ఖర్జారం, చింత, అల్లనేరేడు, డ్రాగన్‌ ఫ్రూట్ వంటి తోటలు. మొత్తం విస్తీర్ణంలో 30.01 ఎకరాల ప్రదర్శన క్షేత్రంలో 11 ప్రధాన పంటలకు సంబంధించి 52 రకాల 17,915 మొక్కలు నాటారు. ఆగ్రో ఫారెస్ట్రీకి సంబంధించిన 5 జాతుల చెందిన 14,747 మొక్కలు నాటారు. వీటితోపాటుగా ఇతర బహువార్షికాలైన మునగ, కరివేపాకు, మల్బరి కూడా వేశారు. తెలంగాణకు హరిత మణిహారంలాగా 42,000 మొక్కలు నాటడం విశేషం. ఒక ఎకరంలో ప్లగ్ టైప్ నర్సరీ యూనిట్, 2 ఎకరాల విస్తీర్ణంలో ఫారమ్ పాండ్‌లు, మరో 6 ఎకరాల్లో షెడ్ నెట్ హౌస్‌లు, పందిళ్లు ఏర్పాటు చేశారు. మిగిలిన 14 ఎకరాలు అంతర్గత రహదారులు, భవనాల నిర్మాణం కోసం కేటాయించారు. సంవత్సరానికి 80 లక్షల కూరగాయల నారు మొక్కలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం గల ప్లగ్ టైప్ నర్సరీ కోసం 5.70 కోట్ల రూపాయలు వెచ్చించారు. ప్రతిష్టాత్మక ఈ సీఓఈ స్థాపించడంలో ఉద్యాన శాఖ చేసిన కృషిని మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశంసించారు. FINAL VOICE OVER రాబోయే రోజుల్లో ఉద్యాన పంటల సాగు కొత్త ఒరవడి సంతరించుకోనున్న దృష్ట్యా విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి రైతులకు కాసుల పంట పండనుంది. అమెరికా, ఇజ్రాయెల్‌, జర్మనీ టెక్నాలజీ అందిపుచ్చుకుని పండ్లు, కూరగాయల పంటల సాగులో స్వయం సమృద్ధి సాధించి విదేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేయాలనేది లక్ష్యం.
Last Updated : Dec 11, 2019, 6:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.