ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటనలో పలు అభివృద్ధిపనులకు శ్రీకారం చుట్టారు. నూతనంగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను, ములుగులో కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంగణంలోనే బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ములుగులో అటవీ కళాశాల, పరిశోధన కేంద్రం వద్ద పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం అనంతరం భవనాన్ని ప్రారంభించారు. పరిశోధన కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఇవాళ గజ్వేల్‌లో పర్యటించనున్న ముఖ్యమంత్రి