ప్లాస్టిక్ అనర్థాల నుంచి ప్రకృతిని కాపాడుకునేందుకు నడుం బిగించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఓ చిరువ్యాపారి. రాజేశం, మంజుల దంపతుల దుకాణంలో.. స్వయంగా తాము తయారు చేసిన కాగితపు సంచుల్లోనే సరుకులు అందిస్తున్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో తామే ప్రతిరోజు సాయంత్రం తయారు చేస్తున్నామని చెబుతున్నారు. ప్లాస్టిక్ కవర్ల కన్నా వీటి ద్వారానే ఖర్చు తగ్గుతోందని... వినియోగదార్ల నుంచి మంచి స్పందన వస్తోందని చెబుతున్నారు.
ఇదీ చూడండి: మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు!