తెలంగాణ ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ కనువిప్పు కలిగేలా చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. 40వ రోజు సమ్మెలో భాగంగా జహీరాబాద్ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ప్రదర్శన కొనసాగించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై బైఠాయించి సమస్యల పరిష్కారంపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కలిగించాలని కోరుకున్నారు. బలవన్మరణానికి పాల్పడ్డ ఆర్టీసీ కార్మికుడికి నివాళులర్పిస్తూ నినాదాలు చేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ