ETV Bharat / state

చర్చిస్తున్నారు.. కానీ శబ్ధమే రావడం లేదు

అక్కడ దాదాపు 50 మంది పోగయ్యారు. తమ సమస్యల గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. తమ డిమాండ్ల సాధనకు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. చర్చలో అందరూ భాగస్వాములయ్యారు.. కానీ అక్కడ నిశబ్ధం రాజ్యమేలుతోంది. ఏంటనీ ఆశ్చర్యపోతున్నారా?

చర్చిస్తున్నారు.. కానీ శబ్ధమే రావడం లేదు
author img

By

Published : Nov 19, 2019, 5:59 AM IST

సుమారు 50 మంది తమ సమస్యలను సంగారెడ్డి కలెక్టర్​కు విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చారు. కలెక్టర్​కు అర్జి ఇచ్చి తమ సమస్యలపై సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అంతా బయటికి వచ్చి పాలనాధికారి స్పందనపై చర్చించుకుంటున్నారు. కొంత మంది వీడియో కాల్ ద్వారా కలెక్టరేటుకు రాని మిత్రులకు సమాచారం ఇస్తున్నారు. ఇంతా జరుగుతున్నా.. కొంచెం శబ్ధం కూడా రావడం లేదు. ఇందుకు కారణం వారంత బధిరులు. చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్నవారు. చేతి సైగల ద్వారా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నారు.

బధిరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న భారతి ఆధ్వర్యంలో వీరంతా సంగారెడ్డి కలెక్టరేట్​కు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు పాలనాధికారి దృష్టికి తీసుకువచ్చారు. వీరికి ప్రభుత్వం అందిస్తున్న 4జీ మొబైల్ ఫోన్​ను వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

బ్యాక్​లాగ్ పోస్టుల నియామకం ప్రతి సంవత్సరం సత్వరంగా పూర్తి చేయాలని వారు కోరారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

చర్చిస్తున్నారు.. కానీ శబ్ధమే రావడం లేదు

ఇదీ చూడండి : 'చట్టవిరుద్ధమా కాదా అని తేల్చేది కార్మిక న్యాయస్థానమే'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.