రోజురోజుకు తగ్గిపోతున్న ఆడపిల్లల సంఖ్యను పెంచేందుకు సంగారెడ్డి జిల్లాలోని హరిదాస్పూర్ గ్రామస్థులు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు. కొండాపూర్ మండలం హరిదాస్పూర్ గ్రామంలో 50 మంది బాలురకు, 44 మందే బాలికలు ఉండటాన్ని గ్రామపంచాయతీ గుర్తించింది.
ఆడశిశువుల జననాలు ప్రోత్సహించేందుకు ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తమ ఊళ్లో అడపిల్ల పుడితే ఉత్సవం నిర్వహించి, ఆ శిశువు పేరు మీద సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి మొదటి ఐదు నెలలు అందులో డబ్బు పొదుపు చేయాలని తీర్మానం చేసింది.
ఈ నెల ఒకటో తేదీన జన్మించిన శిశువుకు గ్రామస్థులు ఓ ఉత్సవం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి సంబురాలు చేసుకున్నారు. గ్రామస్థులంతా కలిసి శిశువు తల్లిదండ్రులకు 5 నెలలకు సంబంధించిన చెక్కులు అందజేశారు.
- ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్