సంగారెడ్డి జిల్లా కంకోల్ గ్రామానికి చెందిన తుల్జారాం, ప్రమీల దంపతుల గారాల తనయుడు మధుకుమార్. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై కాళ్లు, చేతులు కోల్పోయాడు
నెలరోజులు ఆసుపత్రిలో ఉన్న తరువాత ఇంటికొచ్చిన మధు ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించాడు. చదువుకోవాలన్న తపనను తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మధుకుమార్ పరిస్థితిపై ఈటీవీ భారత్ గతంలో ప్రచురించిన కథనాలకు బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ సేవా సంస్థ అధ్యక్షుడు అరికెపూడి రఘు, చిత్రకళలో గిన్నిస్ రికార్డు సాధించిన సముద్రాల హర్షలు స్పందించారు. మధుకుమార్కు నోటితో అక్షరాలు రాసేలా శిక్షణ ప్రారంభించారు. నోటిలో కుంచె పెట్టి తొలుత అమ్మ అనే అక్షరాలు రాయించారు.
అతణ్ని త్వరలోనే జర్మనీకి తీసుకెళ్లి కృత్రిమ చేతులు అమర్చేందుకు కృషి చేస్తామని ఆ వదాన్యులు తెలిపారు.
- ఇదీ చూడండి : అన్నంపెట్టే అమ్మ లేదు.. నడిపించే నాన్న రాడు...