సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అత్యాచారం ఘటన... బాలిక కల్పించిన కట్టుకథగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఓ యువకుడు ఆ బాలికను ద్విచక్రవాహనంపై సినిమాకి తీసుకెళ్లాడని చెప్పారు. సినిమాకి వెళ్లినట్లు తెలిస్తే... తల్లి తిడుతుందని బాలిక అబద్ధం చెప్పినట్లు ఎస్పీ తెలిపారు.
అలాగే బాలిక ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినందుకు ఇంటి యజమానిపై చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మైనర్‌ను తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకెళ్లినందుకు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం: అమీన్‌పూర్‌లో బాలికపై అత్యాచారం