సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌లో 4వ వార్డు వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఓ పార్టీకి చెందిన కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 4వ వార్డులో ఓటు వేసేందుకు వెళ్తున్న ఓ ఓటర్‌కు ఓ పార్టీ కార్యకర్త డబ్బులిస్తుండగా... మరో పార్టీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: పుర పోలింగ్‌కు తరలివస్తోన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు