ETV Bharat / state

ఆ రెండు దొంగతనాలు చేసింది చెడ్డీ గ్యాంగేనా? - హైదరాబాద్ హయత్​నగర్​లో చోరీ చేసిన చెడ్డీగ్యాంగ్ సీసీ కెమేరాల దృశ్యాలు

రాజధానిలో మరోమారు చెడ్డీ గ్యాంగ్‌ కలకలం సృష్టించింది. పెద్ద అంబర్​పేట్ పరిధిలోని హయత్‌నగర్‌లో ప్రజలను బెదిరించి అందినకాడికి దోచుకెళ్లారు. దుండగులు ధరించిన బనియన్‌, చెడ్డీ... బాధితులు చెప్పిన వివరాల ప్రకారం వాళ్లు చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఆ రెండు దొంగతనాలు చేసింది చెడ్డీ గ్యాంగేనా?
author img

By

Published : Oct 27, 2019, 10:45 AM IST

చాలా రోజులుగా హైదరాబాద్‌లో అలికిడి లేని చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ రంగంలోకి దిగిందా? గురువారం అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​లో జరిగిన దొంగతనం చూస్తే నిజమే అనిపిస్తోంది. ఒంటిపై బనియన్‌, చెడ్డీ ధరించిన ఆరుగురు దుండగులు హయత్‌నగర్‌ ప్రాంతంలోని కుంట్లూరు వేద పాఠశాలలో విద్యార్థిని కొట్టి... మహిళలను కర్రలు, ఇనుపరాడ్లతో భయభ్రాంతులకు గురిచేసి... వారి నుంచి లక్ష రూపాయల నగదు, 11 తులాల బంగారం దోపీడీ చేశారు. ఆ తర్వాత పాఠశాల సమీపంలో ఉన్న ఇంట్లో రూ.50 వేల నగదు, 5 తులాల బంగారు అభరణాలను అపహరించారు. దొంగలంతా ఒంటి పై కేవలం చెడ్డీ మాత్రమే ధరించి ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు.

ఆ రెండు దొంగతనాలు చేసింది చెడ్డీ గ్యాంగేనా?

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వేలి ముద్ర నిపుణులు...ఆధారాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులు, బాధితుల నుంచి సమాచారం, వాంగ్మూలం తీసుకున్నారు. కాలనీలోని ఓ ప్రైవేటు పాఠశాలకున్న సీసీ కెమెరాల్లో చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండిః ఇందూరులో చెడ్డీగ్యాంగ్ హల్​చల్

Intro:నోట్ : TG_Hyd_14_25_Dongala Halchal_Ab_TS10012 పైల్ లోని విజువల్స్ ను అవసరమైతే గమనించి వాడుకోగలరు.

రంగారెడ్డి జిల్లా : గురువారం అర్ధరాత్రి హయత్ నగర్ లో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరులో లో వరుస దొంగతనాలతో భయబ్రాంతులకు గురి చేశారు. యాగ్నిక పీఠం వేద పాఠశాలలో సమీపంలో ఆరుగురు సభ్యులు గల ముఠాతో ఇంట్లో ఉన్న నిర్వాహకులను భయబ్రాంతులకు గురి చేసి వారి వద్ద ఉన్న లక్ష రూపాయల నగదు 11 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇదే పాఠశాలలో ఉన్న బాలుని చేతులు బట్టల తో కట్టి, నోట్లో గుడ్డలు కుక్కి చంపేస్తానని బెదిరిస్తూ తమ వద్ద ఉన్న ఇనుప రాడ్లు కర్రలను చూపిస్తూ భయం భయబ్రాంతులకు గురి చేశారు. అనంతరం బయటనుండి గడియవేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు కొద్ది దూరంలోనే మరో ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల నగదును దుండగులు అపహరించారు. రాత్రి తమ మనుమరాలి పుట్టినరోజు కి వెళ్లి తిరిగి ఉదయం వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుందని బాధితురాలు తెలిపారు. సమాచారం తెలుసుకున్న రాచకొండ పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం లతో దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎల్బి నగర్ డిసిపి సన్ ప్రీత్ సింగ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి చోరీ జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు దుండగులు అంతా చేతులలో కర్రలు, ఇనుప రాడ్లు పట్టుకొని హిందీ మాట్లాడుతూ చెడ్డీ లపై ఉన్నారని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెడ్డి గ్యాంగ్ పనేనా, ఇతర దోపిడి గ్యాంగ్ గ అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే కాలనీలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు ఉన్న సిసి కెమెరాలలో చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు నిక్షిప్తమైనాయి. ఇప్పటికే రాచకొండ పోలీసులు ఈ గ్యాంగ్ ను పట్టుకునేందుకు పలు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.Body:TG_Hyd_08_27_Cheddigang CC Visuals_Av_TS10012Conclusion:TG_Hyd_08_27_Cheddigang CC Visuals_Av_TS10012

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.