ETV Bharat / state

నాలుగో రోజు ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ... - priyanka reddy case update

nhrc-team-studding-report
పోలీసులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ
author img

By

Published : Dec 10, 2019, 4:30 PM IST

Updated : Dec 10, 2019, 7:33 PM IST

16:28 December 10

    దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో జాతీయ మానవ హక్కుల కమిషన్ నాలుగో రోజు విచారణ ముగిసింది. ఎన్‌కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం  విచారించింది. షాద్‌నగర్, శంషాబాద్ పోలీసులను కూడా కమిషన్‌ సభ్యులు ప్రశ్నించారు. వీరితో పాటు నిందితులు పెట్రోల్ పోయించుకున్న బంకులో పని చేస్తున్న సర్వీస్ మెన్ ప్రవీణ్​నూ  విచారించారు. పోలీసులు ఇచ్చిన ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికను కూలంకషంగా పరిశీలించింది. ఘటనకు ముందు, తర్వాత పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించింది. 

    చెన్నకేశవులు భార్య తన భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు సాక్ష్యాలు ఏంటని ప్రశ్నించడంతో  దీనిపై పోలీసులను బృందం వివరణ కోరింది. నాలుగు రోజులపాటు చేసిన విచారణలో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం దాదాపు అన్ని అంశాలపై ఓ నివేదిక తయారు చేస్తున్నట్లు సమాచారం. రేపు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం హైదరాబాద్‌లోనే ఉండే అవకాశం ఉంది. నిందితుల ఎదురుదాడిలో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు పూర్తిగా కొలుకున్నట్లు సమాచారం.

ఇవీచూడండి: దిశ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసుల నివేదిక

Last Updated : Dec 10, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.