రెండు, మూడేళ్లలో సిరిసిల్లకు రైలు మార్గం రావడానికి కృషిచేస్తానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్లను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పట్టణంలో ఆయన ఇవాళ పురపాలిక ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
అపెరల్ పార్కులో ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తనదని కేటీఆర్ భరోసా కల్పించారు. నేతన్నలకు తెరాస ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. బీ ఫారాలు రాని ఆశావహులు పెద్ద మనసు చేసుకొని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు.
ఇదీ చూడండి: సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం తెరాసకే ఉంది: కేటీఆర్