కోటి ఎకరాల మాగాణి దిశగా వేసిన జలబాటల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. కరవు సీమలో నూతన శోభను నింపేందుకు కాళేశ్వర గంగమ్మ ఉప్పొంగుతోంది. మొన్నటి వరకు ఎడారిని తలపించిన మానేరు వాగులో జలసవ్వడి పరవళ్లు తొక్కుతోంది. మధ్యమానేరు నుంచి సిరిసిల్ల మానేరువాగులోని గంగమ్మ... ఆలయ చెంతకు చేరింది. మానేరు వంతెన నుంచి 2 కిలోమీటర్ల మేరకు నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సిరిసిల్లలో పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ అందాలను వీక్షిస్తూ జిల్లావాసులు పరవశించిపోతున్నారు.
ఇదీ చూడండి: 'ఆమె 12 ఏళ్లుగా గిరిజనుల కోసం పాటు పడుతోంది'