ETV Bharat / state

పౌరసత్వ రద్దుపై హైకోర్టుకు చెన్నమనేని రమేశ్​

author img

By

Published : Nov 21, 2019, 6:10 PM IST

Updated : Nov 21, 2019, 7:28 PM IST

కేంద్ర ప్రభుత్వం తన పౌరసత్వాన్ని రద్దు చేయడంపై వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ మళ్లీ  హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను కొట్టివేయాలని వ్యాజ్యంలో కోరారు.

పౌరసత్వ రద్దుపై హైకోర్టుకు చెన్నమనేని రమేశ్​

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​ కేంద్రం తన పౌరసత్వాన్ని రద్దు చేయడంపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్​లో కోరారు. మోసపూరితంగా పౌరసత్వం పొందారన్న ఆరోపణ నిజం కాదని... కేంద్ర ప్రభుత్వం పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.

జర్మనీ పౌరసత్వం వెనక్కి

తాను ఇప్పటికే జర్మనీ పౌరసత్వం వెనక్కి ఇచ్చేశానని.. భారత పౌరసత్వం కూడా రద్దైతే.. ఏ దేశానికి చెందకుండా పోతానని చెన్నమనేని పేర్కొన్నారు. మరోవైపు చెన్నమనేని రమేష్ పిటిషన్ దాఖలు చేస్తే.. తనకు నోటీసు ఇచ్చి తన వాదన విన్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేవియట్ దాఖలు చేశారు. పిటిషన్​పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

Intro:Body:Conclusion:
Last Updated : Nov 21, 2019, 7:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.