పెద్దపల్లి జిల్లా అశోక్‌నగర్‌లో నివాసం ఉండే సింగరేణి విశ్రాంత కార్మికుడు సల్లం మల్లేశ్, సరోజ దంతులకు పిల్లలు లేకపోవడం వల్ల 2014లో హైదరాబాద్‌లోని శిశు విహార్ నుంచి జ్యోతి అనే విద్యార్థిని దత్తత తీసుకున్నారు. జ్యోతిని కన్నబిడ్డలా చూసుకుంటామని అంగీకార పత్రాలను రాసుకున్నారు. జ్యోతి ప్రస్తుతం రామగుండం ఎన్టీపీసీలోని కేంద్రీయ విద్యాలయంలో 10వ తరగతి చదువుతుంది.
ఉరివేసుకుని
పాఠశాల నుంచి వచ్చిన జ్యోతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జ్యోతి ఆత్మహత్య పలు అనుమానాలు రేకెత్తించాయి. చేతి మణికట్టు, శరీరంపై గాయాలు కనబడుతున్నాయి. జ్యోతి ఆత్మహత్య చేసుకున్న విషయం తోటి విద్యార్థుకు తెలియటంతో పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివచ్చారు. దత్తత తీసుకున్నావారే ఈ ఘాతకానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇంట్లో తల్లిదండ్రులు పెడుతున్న బాధలను తమకు చెప్పుకునేదని.. జ్యోతికి న్యాయం చేయాలంటూ గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: భయం... భయంగా బాహ్యవలయం