పురపాలక ఎన్నికల కోసం ప్రచురించిన ఓటర్ల జాబితాలో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓటర్ల పేర్లను తెలుగులోంచి ఆంగ్లంలోకి అనువదించారు. ఇనుముల సత్యనారాయణ అనే వ్యక్తి పేరును... ఆంగ్లంలో ఐరన్ సత్యనారాయణ అని ముద్రించారు. మారుపాక బాపు పేరును ఆంగ్లంలో డోంట్ చేంజ్ బాపు, మారుపాక యశోద పేరును ట్రాన్స్‌ఫార్మ్ యశోద, గుమ్మడి అనురాధ పేరును పంప్కిన్ అనురాధ అని ముద్రించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోనూ ఇలాంటి విచిత్రాలే అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు కల్పించారు. వయస్సను 35ఏళ్లుగా ముద్రించారు. ఇదేంటని మున్సిపల్ అధికారుల్ని నిలదీస్తే … రెవెన్యూ అధికారుల్ని అడగాలని తప్పించుకుంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇదీ చూడండి : మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు.. వయసు 35 ఏళ్లు