నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పేపర్ మిల్ శివారులో విషాదం నెలకొంది. నిన్న మధ్యాహ్నం ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారుల ఆచూకీ కోసం తల్లిదండ్రులు, స్థానికులు విస్తృతంగా గాలించారు. వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
గ్రామ శివారులోని నీటి కుంటలో పోలీసులు గాలించగా ఈరోజు ఉదయం ముగ్గురు చిన్నారులు శవాలై కనిపించారు. మృతులు సిద్దార్థ్(8), దీపక్(7), హుజుర్ (6). ఇందులో సిద్దార్థ్, దీపక్ అన్నదమ్ములు.