నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం వసతి గృహంలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బాలికల వసతి గృహానికి సెక్యూరిటీ గార్డులు లేరని, హాస్టళ్లలో నీటి సమస్య తలెత్తిందని, వంట చేసే వాళ్ళు లేక ఆహార పదార్థాలు బయట నుంచి తీసుకొస్తున్నారని... అది అందరికీ సరిపోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తరగతులు బహిష్కరించి విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ముందు బైఠాయించారు.
విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది జీవో నంబర్ 14 అమలు చేసి.. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా నిరవధిక సమ్మెకు దిగారు. ఈ కారణంతో వసతి గృహాల్లో ఇబ్బందులు తలెత్తాయి.
ఇదీ చూడండి: వేతనం ఇవ్వకపోవడం చట్ట విరుద్ధం..!