నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఉన్న 42 గేట్లను విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. అందువల్ల ప్రాజెక్టు పూర్తి గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు గరిష్ఠంగా కొనసాగుతోంది. 42 గేట్లు ఎత్తి వేయడం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి: బోరుబావిలో రెండున్నరేళ్ల బాలుడు.. రంగంలోకి ఐఐటీ