ETV Bharat / state

పెట్రోల్​తో ఎమ్మార్వో కార్యాలయానికొచ్చాడు.. కానీ!

నిజామాబాద్ జిల్లా బోధన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఇదంతా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఎదుటే జరగడం గమనార్హం.

పెట్రోల్​తో ఎమ్మార్వో కార్యాలయానికొచ్చాడు.. కానీ!
author img

By

Published : Nov 13, 2019, 5:43 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ తహసీల్దార్ కార్యాలయానికి పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చిన ఓ వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. బోధన్ మండలం సాలూరకు చెందిన నజీర్ అనే వ్యక్తి సాలూర గ్రామంలోని బస్టాండులో హోటల్ నిర్వహించేవాడు.

రెండేళ్ల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు తన హోటల్​ని కూల్చి, అందులోని సామాన్లను తగలబెట్టారని నజీర్ వాపోయాడు. అనంతరం ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే... తాను కోర్టుకు వెళ్లి ఆ భూమి తన ఆధీనంలోకి వచ్చేలా పట్టా తెచ్చుకున్నానని బాధితుడు చెబుతున్నాడు.

అలా పట్టా తెచ్చుకున్నప్పటికీ.. ప్రజాప్రతినిధుల అండదండలతో తనని అక్కడ హోటల్ నిర్వహించకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు 8 లక్షల రూపాయల అప్పు ఉందని అలాగే తన ఆరుగురు పిల్లలను పోషించడం చాలా కష్టంగా మారిందని వాపోతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాను హోటల్ నిర్వహించుకునేందుకు సహకరించాలని నజీర్ డిమాండ్ చేశాడు.

పెట్రోల్​తో ఎమ్మార్వో కార్యాలయానికొచ్చాడు.. కానీ!

ఇవీ చూడండి: ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం- సుప్రీం సంచలన తీర్పు

Intro:TG_NZB_09_13_MRO_OFFICE_MUNDU_HAATMAHATYA_YATNAM_AVB_TS10109
()
నిజామాబాద్ జిల్లా బోధన్ తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ తో వచ్చిన వ్యక్తి. తన భూ సమస్య పరిష్కారం కావడం లేదని అక్కడికి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ముందు ఆత్మహత్య కు యత్నించాడు. బోధన్ మండలం సాలుర గ్రామానికి చెందిన నజీర్ అనే వ్యక్తి సాలుర బస్ స్టాండ్ లో హోటల్ నిర్వహించేవాడు. అది ప్రభుత్వ స్థలం కావడంతో గతంలో కొందరు దానిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే కోర్టుకు వెళ్లి అది తన ఆధీనంలోకి వచ్చేలా పట్టా ఇచ్చారని బాధితుడు తెలిపారు. గత రెండు సంవత్సరాల క్రితం అధికార పార్టీకి చెందిన కొందరు తన హోటల్ కూల్చి, అందులోని సామాను లు తగలబెట్టారని ఆయన వాపోయారు. ఇప్పటికైనా తనకు సరైన న్యాయం చేయాలని నజీర్ డిమాండ్ చేశారు.
byte: నజీర్, బాధితుడు
End

Body:శివ

Conclusion:9030175921

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.