నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఓ రైతు అన్నదమ్ముల మధ్య బోరు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమీపంలోని ఓ చెట్టెక్కి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే చెట్టు ఎక్కి రైతును కిందకు దింపారు. నీ సమస్య తప్పకుండా తీర్చేలా చేస్తామని చెప్పడం వల్ల తన ఆత్యహత్యాయత్నాన్ని విరమించుకున్నాడు. రైతు దర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన అంకం గంగాధర్ అని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: మూడున్నర గంటలుగా ఎంఎంటీఎస్ క్యాబిన్లోనే లోకో పైలెట్