ETV Bharat / state

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు - human story in nizamabad

తోటి వారిలాగా బడికెళ్లాలనే ఉత్సాహం... ఉన్నత చదువులు అభ్యసించి అమ్మను బాగా చూసుకోవాలనే ఆరాటం... పసిప్రాయంలోనే ఎంతో  దూరపు ఆలోచనలు ఉన్నా... విధి చూసిన చిన్నచూపు ఆమెను రోజురోజుకు కుంగదీస్తోంది. క్రమంగా పెరుగుతున్న వ్యాధి తీవ్రత ఒకవైపు... ఎలాగైనా దానిని ఎదురించాలనే పట్టుదల మరోవైపు... వెరసి తనకొచ్చిన కష్టం నుంచి బయటపడేందుకు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని.

nandini need a help for her health issues in nizamabad
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
author img

By

Published : Dec 8, 2019, 9:54 AM IST

నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం దుర్గానగర్‌ తండాకు చెందిన కేతావత్ లలితకు కుమార్తె నందిని ఉంది. తన చిన్నప్పుడే అమ్మానాన్నలు విడిపోగా... తల్లి దగ్గరే ఉంటున్న నందిని మాక్లూర్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మానసిక వ్యాధితో బాధపడుతున్న లలిత రోజువారి కూలీ పనిచేస్తూ... బిడ్డను పోషిస్తోంది.

ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. మధుమేహం, థైరాయిడ్‌ సోకటంతో... నిత్యం ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటుంది. 3 నెలల క్రితమే ఒక కన్ను చూపు పూర్తిగా కోల్పోయిన నందిని... క్రమంగా మరో కంటి చూపును కోల్పోతుంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి వచ్చిన కష్టం మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది.

చదువుల్లో టాపర్‌గా ఉండే నందిని మంచానికి పరిమితమై కుమిలిపోతోంది. వైద్య ఖర్చుల కోసం దాతలు ముందుకొచ్చి సహకరించాలని బాలిక కోరుతోంది.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

ఇవీ చూడండి:దిశ నిందితుల మృతదేహాలు తరలింపు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.