నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహిత మహిళ న్యాయపోరాటానికి దిగింది. తన అశ్లీల దృశ్యాలు సెల్ఫోన్లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. బాధితురాలికి మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లో ఈ ఘటన కలకలం రేపింది.
ఉపాధి కోసం భర్త దుబాయ్‌కి వెళ్లటం వ్లల రజిత అనే మహిళ ఇద్దరు పిల్లలను పోషిస్తూ నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి చనువు పెంచుకుని రజితను లోబర్చుకున్నాడు. ఆమె నగ్న దృశ్యాలను రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. శారీరకంగాను అనుభవించాడు. తనకు డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేశాడు. అవసర నిమిత్తం 12 లక్షలు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వక పోవటం వల్ల విషయం భర్తకు తెలిసింది. ఆగ్రహించిన భర్త రజితను ఇంటి నుంచి గెంటి వేశాడు. బాధితురాలు రజిత తనను మోసం చేసిన ప్రదీప్ ఇంటి వద్ద ఆందోళన చేపట్టింది. ఆమెకు మహిళా సంఘాలు అండగా నిలిచాయి. అక్కడే వంటా వార్పు నిర్వహించారు.
పరారీలో ఉన్న ప్రదీప్‌ను పట్టుకు రావాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగటంతో కొద్ది సేపు ఉద్రిక్తత ఏర్పడింది. తనను శారీరకంగా వాడుకుని నమ్మించి బ్లాక్ మెయిల్‌తో డబ్బులు తీసుకున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది.
ఇవీచూడండి: సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణం : రేవంత్