తాళం వేసిన ఇంట్లో చోరీ.. 15 లక్షలు అపహరణ - సాటాపూర్
నిజామాబాద్ జిల్లా సాటాపూర్లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో 15 లక్షల నగదును కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ.. 15 లక్షలు అపహరణ
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఆమన్ అనే పశువుల వ్యాపారి ఇంట్లో లేని సమయంలో తాళం పగులగొట్టి 15 లక్షల నగదు దోచుకెళ్లారు. బాధితుడు వచ్చి చూడగా ఇల్లు తాళం తీసి ఉండడం వల్ల పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు జాగిలంతో పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
sample description