ETV Bharat / state

ఇందూరులో అర్వింద్​ను గెలిపించిన బాండ్​ పేపర్​ - arvindh sign on band paper

ఇందూరులో విజయాన్ని కైవసం చేసుకున్న భాజపా అభ్యర్థి అర్వింద్... ఎన్నికలకు ముందు ఓ అస్త్రాన్ని సంధించారు. దాని ద్వారా ఆయన విజయాన్ని అందుకున్నారని తెలుస్తోంది. అదేంటో మీరూ చూడండి.

ఇందూరులో అర్వింద్​ను గెలిపించిన బాండ్​ పేపర్​
author img

By

Published : May 24, 2019, 11:54 AM IST

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిజామాబాద్​ పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్యంగా ధర్మపురి అర్వింద్ విజయకేతనం ఎగురవేశారు. స్వయంగా ముఖ్యమంత్రి తనయ, ఇందూరులో పాగావేసిన కవితను ఓడించి... కమలాన్ని వికసించేలా చేశారు. అంతలా ప్రజలు అతనిలో ఏం చూసి నమ్మారు అనే ఆసక్తి జనాల్లో కలుగుతోంది. పార్లమెంటు ఎన్నికల ముందుకు అర్వింద్ ఓ అస్త్రాన్ని ఉపయోగించారు. అదే అర్వింద్ రాసిన 100 రూపాయల బాండ్ పేపర్​. ఒకవేళ నిజామాబాద్​ ఎన్నికల్లో తాను గెలిస్తే... పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని, పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పిస్తానని ఒప్పంద పత్రం​లో రాశారు. ఒకవేళ వాటిని నేరవేర్చని పక్షంలో తన పదవికి రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొంటానని హామీనిచ్చారు. ఆ ఒప్పంద పత్రం ప్రజల్లోకి వచ్చింది. ఇది అర్వింద్ విజయం వెనకున్న అసలు రహస్యం అని భాజపా శ్రేణుల్లో చర్చనీయాంశమైంది.

ఇందూరులో అర్వింద్​ను గెలిపించిన బాండ్​ పేపర్​
ఇందూరులో అర్వింద్​ను గెలిపించిన బాండ్​ పేపర్​

ఇదీ చూడండి: 'భారత ఎన్నికలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకం'

Intro:panthangi toll plaza

Body:panthangi toll plaza

Conclusion:panthangi toll plaza

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.