పంట పొలాల్లో పంటకు నీరు అందించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్లో జరిగింది. లక్ష్మణ్ అనే రైతు తన పంట పొలాన్ని అడవి జంతువుల నుంచి కాపాడడానికి కంచె వేశాడు.
కంచెకు విద్యుత్తు సరఫరా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు తీగలు తగలి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'నీరే ఇవ్వలేదు... ఓట్లు ఎలా అడుగుతరు'