నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని బోరిగాంకు చెందిన ఎడ్ల కళావతి (44) అనే మహిళా రెండు రోజుల క్రితం భజన కార్యక్రమానికి వెళ్తానని చెప్పి కనబడకుండాపోయింది. కేసు నమోదు చేసిన ఎస్సై మహమ్మద్ యూనుస్ అలీ దర్యాప్తు చేపట్టారు. గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కొందరిని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
హత్య చేసి గోనె సంచిలో వేసి తల్వేద చెరువులో వేశామని నిందితుల ద్వారా తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. నిందితులు తోట నరేశ్, తోట రమేశ్‌ను కఠిన శిక్షించాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ అరెస్ట్