ETV Bharat / state

నిర్మల్ చెత్త... అనంతపేట్​ను కాల్చేస్తోంది - నిర్మల్ చెత్త... అనంతపేట్​ను కాల్చేస్తోంది

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఊరి బయట డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది రోజూ చెత్తంతా తీసుకెళ్లి అక్కడ పారబోస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆ ఊరి వ్యర్థాలు పక్క ఊరిని అతలాకుతలం చేస్తున్నాయి. డంపింగ్ యార్డు కంపు భరించలేమని ఆ గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. వెంటనే ఇక్కడి నుంచి తరలించి తమ కష్టాలను దూరం చేయాలని వేడుకొంటున్నారు.

నిర్మల్ చెత్త... అనంతపేట్​ను కాల్చేస్తోంది

author img

By

Published : Dec 13, 2019, 6:33 AM IST

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా... పట్టణ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ సుమారు 60 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. దాదాపు 50 టన్నుల చెత్త మున్సిపల్ సిబ్బంది సేకరిస్తుంటారు. దీనిని ప్రత్యేక వాహనాల్లో బంగల్​పేట్​, ఎదులాపురం శివారులోని డంపిగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేసి చేయాల్సి ఉండగా... సిబ్బంది నిర్లక్ష్యంతో అంతా ఒకే చోట పడేస్తున్నారు.

నిబంధనలు అతిక్రమిస్తున్నారు..

డంపింగ్ యార్డుకు తరలించిన చెత్తను నిబంధనలకు విరుద్ధంగా కాల్చేస్తున్నారు. ఎప్పుడు చూసినా చెత్త కాలుతూ... పొగలు కక్కుతూ కనిపిస్తుంది. సమీపంలోనే అటవీ ప్రాంతం ఉన్నందున ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు. ఆసుపత్రుల నుంచి సేకరించిన వ్యర్థాలు కూడా కాలి బూడిద చేస్తున్నారు. ఆరోగ్యరీత్యా ఇవి చాలా ప్రమాదకరం కాబట్టి విధిగా భూమిలో పూడ్చాలి. కానీ ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల గ్రామస్థులు ఇబ్బందులు పడాల్సివస్తోంది. నిబంధనలు ఉల్లఘిస్తే కేసు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మూగజీవాల మృత్యువాత..

గాలివాటం దిశగా పొగ ప్రయాణిస్తుండటం వల్ల... సాయంకాలమైందంటే గ్రామస్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిస్తే.. అటవీ ప్రాంతం నుంచి వచ్చే నీరు వ్యర్థాల బూడిదతో కలిసి చెరువులోకి చేరుతోంది. నీరు కలుషితమై... చెరువులోని చేపలు, నీరు తాగిన పశువులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కలెక్టర్, మంత్రి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

డంపింగ్ యార్డు నుంచి వచ్చే పొగతో అనారోగ్యం పాలవుతున్నామని ఆరోపిస్తున్న అనంతపేట్​ గ్రామస్థులు.. అధికారులు స్పందించి తక్షణమే ఇక్కడి నుంచి తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి: బంగారు తెలంగాణ కాదు.. బాకీల తెలంగాణ: రేవంత్

Intro:TG_ADB_31_12_DUMP_ADD_PKG_TS10033
TG_ADB_31a_12_DUMP_ADD_PKG_TS10033
TG_ADB_31b_12_DUMP_ADD_PKG_TS10033
TG_ADB_31c_12_DUMP_ADD_PKG_TS10033
చెట్లకు సెగ .. ఊరికి పొగ..
గమనిక .. స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా వచ్చింది..

Body:నిర్మల్ జిల్లా

Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.