పౌరసత్వ సవరణ చట్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి నివాసంలో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టంపై పోరాటం చేసేందుకు కాంగ్రెస్తో కలిసి నడవాలని కేసీఆర్ను కోరారు.
భారతదేశంలో అన్ని మతాల వారికి జీవించే హక్కు ఉందన్నారు. హిందూ దేశంగా మార్చాలని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామారావు పటేల్, మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: గాంధీభవన్లో కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం