నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని నాయబాది కాలనీకి చెందిన 14సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. ఈ బాలిక ముధోల్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు ఈ నెల 14న జర్వం రావటంతో తండ్రి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర వైద్యపరీక్షలు చేయించాడు.
మంగళవారం ఉదయం వసతిగృహానికి వెళ్తానని చెప్పిన బాలిక అదృశ్యమైంది. తండ్రి అబ్దుల్ సలీమ్ ఎంత వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.