ముఖ్యమంత్రిగా కేసీఆర్, పురపాలక మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన పార్లమెంటు నల్గొండలో పర్యటించారు. అధికార పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇన్నాళ్లూ అన్ని అంశాలపై భాజపాకు కేసీఆర్ సర్కారు మద్దతు పలికిందని.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా శాసనసభలో తీర్మానం చేయాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని చెప్పారు. హస్తం పార్టీ కార్యకర్తలు అందరూ ప్రచారంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: వికారాబాద్లో మైనర్బాలికపై అత్యాచారం