ETV Bharat / state

కాళ్లు, వెన్నుముక లేకున్నా... బండి నడుపుతూ...

ఓ ప్రమాదం వారి జీవితాల్ని తారుమారు చేసింది. భర్త లేచి నడుద్దామంటే కాళ్లు లేవు. నిలబడుదామంటే వెన్నుముక నిలవదు. గత 9 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. కట్టుకున్న భార్య అన్నీ తానై... అమ్మలా సాకుతుంది. ప్రభుత్వ సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్న ఆ దంపతులపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

author img

By

Published : Nov 21, 2019, 8:03 PM IST

కాళ్లు, వెన్నుముక లేకున్నా... బండి నడుపుతూ...
కాళ్లు, వెన్నుముక లేకున్నా... బండి నడుపుతూ...

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మర్రిగూడెంకు చెందిన రమేష్.. 9 ఏళ్ల క్రితం తాటి చెట్టు పైనుంచి పడి కాళ్ళు, వెన్నుముక విరిగాయి. అప్పటి నుంచి మంచానికి పరిమితమయ్యాడు. ఏమి చేయలేని స్థితిలో ఉన్న రమేష్​కు అతని భార్య లక్ష్మీ అన్ని తానై చూసుకుంటుంది. కట్టుకున్న భార్యే... కన్న తల్లిలా సాకుతుంది.

మోటార్​ సైకిల్​ సహాయంతో:

సాగు చేసుకోవటానికి భూమి ఉన్నా.. పొలం దగ్గరికి వెళ్లలేని పరిస్థితి వారిది. రమేష్​కు ముగ్గురు ఆడపిల్లలు. ఇళ్లు గడవటమే కష్టంగా ఉన్న రమేష్​కు.. పిల్లలను చదివించటం భారంగా మారింది. ఇంట్లో ఉన్న మగ దిక్కు మంచం పట్టటంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. భార్య లక్ష్మీ కూడా భర్తను చూసుకుంటూ ఇంటి వద్దే ఉంటుంది. సొంత పనుల కోసం బయటికి వెళ్లాలంటే రమేష్​కు ఇబ్బందిగా ఉండటంతో 70 వేల రూపాయాలు అప్పు చేసి మోటర్ సైకిల్ కొనుకున్నాడు. తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మరో 20 వేలు ఖర్చయింది. ఉన్న ఊళ్లో స్థలం లేక వ్యవసాయ భూమి వద్దే చిన్నపాటి ఇళ్లు కట్టుకుని ఊరికి దూరంగా ఉంటున్నారీ దంపతులు.

9ఏళ్లుగా దీన స్థితిలో:

రమేష్ ఏదైనా పని మీద ఊళ్లోకి రావాలంటే 3 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. నెల రోజులకు సరిపడా మందుల కోసం 7 నుంచి 8 వేల రుపాయల ఖర్చు అవుతుందని రమేష్ చెబుతున్నాడు. 9ఏళ్ల నుంచి భర్తకు సేవలు చేస్తున్న లక్ష్మి.. పరిస్థితి దినదిన గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

చేయూతకై...

పూట గడవటమే కష్టంగా మారిన తమకు ప్రభుత్వమే ఆదుకుని ఏదైనా ఉపాధి కల్పించాలని ఈ దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.