ETV Bharat / state

వైద్యం దయనీయం... ప్రజల వ్యథ వర్ణనాతీతం

author img

By

Published : Nov 23, 2019, 11:50 AM IST

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నా... మారుమూల పల్లెలకు మాత్రం ఆరోగ్య సేవలు పూర్తిగా అందడం లేదు. తండాలు ఎక్కువగా ఉండే దేవరకొండ నియోజకవర్గంలో పేరుకే ప్రభుత్వాసుపత్రి అన్న పేరు తప్ప... వసతులు మాత్రం శూన్యమని చెప్పాలి. కనీస సౌకర్యాలు లేవన్న సాకుతో... రోగుల్ని ఇతర ప్రాంతాలకు వెళ్లాలని అక్కడి వైద్య సిబ్బందే చెబుతున్నారు.

దయనీయ స్థితిలో దేవరకొండ  ప్రభుత్వాసుపత్రి

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ దవాఖానాను... 2013లో వంద పడకలకు విస్తరిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పేరుకే వంద పడకలు కానీ... 50 పడకలు కూడా సరిగా లేని దుస్థితి. నిత్యం వెయ్యికి పైగా ఓపీతోపాటు 250 వరకు ఇన్ పేషెంట్ల సంఖ్య ఉంటోంది. 25 మంది వైద్యులకుగాను 23 మంది విధుల్లో ఉంటున్నా... వాళ్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియని అయోమయ పరిస్థితి ఉందని రోగులు చెబుతున్నారు.

వసతులు లేక...

మందులు, సూదుల కోసం... గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రసవాల సమయంలో అవసరమయ్యే అల్ట్రా స్కానింగ్ పరికరాలు లేకపోవడంతో... ప్రైవేటు ఆసుపత్రుల్ని ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.

అందుబాటులో లేని వైద్య పరీక్షలు

పెద్దాసుపత్రికి వచ్చే రోగులకు మందులు అవసరం కాగా అందులో కొన్నిమాత్రమే దొరుకుతున్నాయి. మందుల కోసం ఏటా 25 లక్షలు కేటాయిస్తున్నా... అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. వివిధ వైద్య పరికరాల కోసం రెండు మూడేళ్ల నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా... అమలుకు నోచుకోవడం లేదు. పరికరాలు లేక వైద్య పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని రోగులు చెబుతున్నారు.

అప్పటి కలెక్టర్​ ఆగ్రహం

గతంలో కలెక్టర్‌గా పనిచేసిన గౌరవ్‌ ఉప్పల్‌ ఈ ఆస్పత్రిని సందర్శించి సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు సరిగా నిర్వర్తించని వైద్యుడిని సస్పెండ్‌ చేశారు. సమయానికి వైద్యులు రావడం లేదని రోగులు చెబుతుండగా... ఇతర సిబ్బంది లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నామని వైద్యులు అంటున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో వరుసగా మూడో రోజూ బంద్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.