ETV Bharat / state

సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీకి వెళ్తే తప్ప పూట గడవని స్థితి ఆ దంపతులది. భర్తకు వచ్చే రెండు వందల రూపాయల కూలే వారికి జీవనాధారం. ఉన్నంతలోనే సంతోషంగా సాగే జీవితం. ఇంతలోనే వారికి పెద్ద కష్టమొచ్చింది. వాళ్ల తొమ్మిది నెలల కుమారుడి గుండెకు రంధ్రం ఉందని... ఆపరేషన్ చేయకపోతే కష్టమేనని చెప్పిన వైద్యుల మాట వారిని కుంగదీసింది.

author img

By

Published : Nov 24, 2019, 8:35 PM IST

సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

ఆ తల్లిదండ్రులు ఎక్కని మెట్టు లేదు... తొక్కని గడప లేదు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అతుకుల బొతుకుల జీవితంలో.. కొడుకునెలా కాపాడుకోవాలో తెలియని ధైన్యం వాళ్లది. ఈ కన్నీటి గాథ... నల్గొండకు చెందిన వెంకటేశ్​, పావని దంపతులది.

సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

నల్గొండకు చెందిన ఆకుల వెంకటేశ్​, పావని దంపతులకు తొమ్మిది నెలల కుమారుడు విఘ్నేశ్​ ఉన్నాడు. వెంకటేశ్​ దినసరి కూలీ. పని దొరికితే వచ్చే ఆ కూలీ డబ్బులపైనే ఆ కుటుంబం ఆధారపడి ఉంది. ఉన్న దాంట్లో సద్దుకుపోయే వారికి... కొడుకు అనారోగ్యం కష్టాల్లోకి నెట్టింది. విఘ్నేశ్​ శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండడం వల్ల ఆస్పత్రులు చుట్టు తిరిగారు. అయినా నయం కాకపోవడం వల్ల అప్పు చేసి హైదరాబాద్​లోని నిలోఫర్, రెయిన్ బో ఆస్పత్రుల్లో చూపించగా హృదయ సంబంధిత సమస్యగా గుర్తించారు.

ఆపరేషన్​కు రూ.5 లక్షలు

గుండెకు రంధ్రం పడ్డట్లు గుర్తించిన వైద్యులు వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్​కు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ దంపతులిద్దరు ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని కన్నీటితో వేడుకుంటున్నారు.

దాతల కోసం

ఇప్పటికే తాళిని తాకట్టు పెట్టి, అప్పుచేసి ఆస్పత్రులు చుట్టు తిరిగామని మొరపెట్టుకోగా కనీసం రూ.3 లక్షలు వరకైనా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని పావని తెలిపారు. మనసున్న మారాజులు స్పందించి ఆ చిన్నారికి ప్రాణం పోయాలని కోరుతున్నారు స్థానికులు.

ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్​ఎంసీ అప్రమత్తం

Intro: చేనేత కుటుంబానికి అంతా చింతలే...ఆభ శుభం తెలియని ఆ చిన్నారి తల్లితండ్రులకి అన్ని కష్టాలే...రెక్కడితేగాని డొక్కాడని పరిస్థితి ఆ చిన్న కుటుంబానిది.... ఆ బిడ్డను బ్రతికించుకోవడం కోసం ఆ తల్లితండ్రులు చేయని అప్పులేదు..... పైసలు పెట్టంది ప్రాణాలు దక్కవు కానీ లెవ్వు. ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితి లో ఆ కుటుంబ జీవితం.నల్గొండ పట్టణంలోని పద్మనగర్ కాలనీకి చెందిన ఆకుల వెంకటేష్ ,పావని దంపతులకు ఏడాది క్రితం వివాహం అయింది.వెంకటేష్ రోజు రెండు వందల రూపాయల దినసరి కూలి నెల పెరు మీద ఆరు వేల రూపాయలు సంపాదిస్తాడు. అందులో సగం డబ్బులు ఇంటి అద్దెకు పోను మిగిలినవాటితో జీవితం సాగుతుండేది. ఆ దంపతులకు తిమ్మిది నెలల బాబు పేరు విగ్నేష్ అప్పుడప్పుడు జలుబు,శ్వాస తీసుకోవడం మొదలైన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చేవి.ఆ చిన్నారికి గత కొంతకాలంగా శ్వాసతీసుకోవడం కష్టంగా ఉన్నాడటంతో పట్టణ కేంద్రంలో ని,ప్రభుత్వ,ప్రవేట్ హాస్పిటల్స్ లలో చూపించిన నయంకాలేదు. కొన్ని హాస్పిటల్స్ లలో న్యుమోనియా గా చెప్పటం జరిగింది. హైదరాబాద్ లోని నిలోఫర్,రెయిన్ బో మొదలైన హాస్పిటల్స్ లలో చూయించగా హృదయం సంబంధిన సమస్యగా డాక్టర్లు పేర్కొన్నారు. హృదయానికి రంద్రం పడ్డట్టుగా వారం రోజుల్లో ఆపరేషన్ చేయంది బ్రతకడం కష్టమని డాక్టర్లు తెలియజేయడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ఆపరేషన్ చేయాలంటే ఐదు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఇప్పుడు ఆ దంపతులుఇద్దరు ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మా బిడ్డా ప్రాణాలు కాపాడాలని కన్నీటితో వేడుకుంటుంన్నారు.ఇప్పటికే చాలా భార్య తాళి తాకట్టు పెట్టి, అప్పుచేసి చూపించుకున్న మళ్ళీ గుండెకు ఇన్ఫెక్షన్ వచ్చిందని అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలని సూచించారు. అంత డబ్బులేదని డాక్టర్ల కు మొరపెట్టుకోగా కనీసం మూడు లక్షల వరకైనా అవుతుందని చెప్పడం తో ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. గమనిక:-విజువల్స్ FTP ద్వారా పంపడo జరిగింది.చూసి వాడుకోగలరు.

Body:,,

Conclusion:9502994640. బి.మధు. నల్గొండ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.