శ్రీశైలం ఎడమగట్టు జలాశయం ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. జలాశయం విద్యుత్ శక్తి కేంద్రం వద్ద మరమ్మతు పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం, మంటలు చెలరేగడంతో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులు ఉలిక్కిపడి పరుగులు తీశారు. తీరా చూస్తే అంతా అయిపోయాక జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అది కేవలం మాక్ డ్రిల్ మాత్రమే అని ప్రకటించడంతో ఉద్యోగులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
విద్యుత్ శక్తి కేంద్రంలోకి వెళ్లే మార్గంలో 600 నుంచి 700 మీటర్ల వద్ద ఉన్న ట్రాన్మ్ఫార్మర్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే కేబుల్ పైనుంచి భారీ వాహనం వెళ్లడం వల్ల కేబుల్ వైరు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ అయి పేలుడు శబ్ధం వచ్చిందని ప్రత్యక్ష సాక్షుల కథనం.
దీనితో అక్కడి ఉద్యోగులు సిబ్బంది పరుగులు తీశారు. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పారు. కొంతసేపటికి అధికారులు ఇది మాక్ డ్రిల్ అని ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
ఇదీ చూడండి: 2018లో 1.79 కోట్లు పెరిగిన దేశ జనాభా