నిరుపేదల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువులో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, జడ్పీ ఛైర్ పర్సన్ పెద్దపల్లి పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డితో కలిసి చేప పిల్లలను నీటిలోకి వదిలారు.
నాగర్ కర్నూల్ ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆసుపత్రిని అన్ని హంగులతో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్‌తో పాటు పాల ఉత్పత్తిదారుల కోసం విజయ డైరీ అవుట్ లెట్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.
మంత్రి జిల్లా పర్యటన సందర్భంగా స్థానిక భాజపా నాయకులు సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందజేస్తామని చెప్పి బస్టాండ్ వద్దకు చేరుకోగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.