ములుగు జిల్లా మేడారం వనదేవతల దర్శనానికి వచ్చిన ఇద్దరు భక్తులు స్నానానికి వెళ్లి జంపన్న వాగులో గల్లంతయ్యారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీకి చెందిన ప్రశాంత్ కుటుంబం దర్శనానంతరం చిలుకలగుట్ట సమీపంలోని వాచ్‌టవర్ కింద విడిది చేశారు.
భారీ ప్రవాహం వల్లే...
కుటుంబసభ్యులు పనిలో ఉండగా.. ప్రశాంత్, రఘు సరదాగా ఆడుకునేందుకు జంపన్నవాగులోకి దిగారు. వాగులో భారీ ప్రవాహం వచ్చి వారిద్దరూ గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులు రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు..
సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం గల్లంతైన వారి ఆచూకీ ఇప్పటివరకూ దొరక్కపోవడం వల్ల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు