మేడారం మహా జాతర ఏర్పాట్లను ఉన్నత అధికారులు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపాలు తాత్కాలిక నిర్మాణాల్లో అవినీతిపై ఈనాడు- ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. పనులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ములుగు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన విజిలెన్స్ బృందాలను అప్రమత్తం చేసి పనుల్లో నాణ్యత ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీచేశారు.
ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చక్రధర్ పనులను పరిశీలించేందుకు వెళ్లగా.. రహదారిపై పెరిగిన గడ్డిని తొలగించి.. నాణ్యత లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేశారు అధికారులు. దీనిపై పీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక మరుగుదొడ్ల పనుల్లో నాణ్యత పాటించాలని.. లేదంటే బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆసియాలోనే అతిపెద్ద జాతరపై ఎందుకింత నిర్లక్ష్యం?