ములుగు జిల్లా దేవనగరంలో ఓ వ్యక్తి దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. దేవనగరంలో కొత్తగా నిర్మిస్తున్న రైస్ మిల్లులో ఏడుకొండలు, భిక్షపతి అనే ఇద్దరు కూలీలు పనికోసం చేరారు. బుధవారం అర్ధరాత్రి ఏడుకొండలు దారుణ హత్యకు గురయ్యాడు. తోటి కార్మికుడే ఏడుకొండలును హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. తాపీ మేస్త్రీ భిక్షపతి... తన భార్యతో ఏడుకొండలు తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడనే అనుమానంతో తాగిన మైకంలో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ములుగు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చూడండి: బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కీచక అధ్యాపకుడు!!