ETV Bharat / state

'మేడారం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే'

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో నాణ్యతా లోపాలతో జరిగిన ఊరట్టం-కన్నెపల్లి రోడ్డును ములుగు జిల్లా ఇంఛార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈనాడు-ఈటీవీ భారత్​ ప్రచురించిన మేడారం పనులు తారుమారు కథనంపై స్పందించిన జిల్లా పాలనాధికారి స్వయంగా... క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టారు. పనుల్లో నాణ్యత పాటించని గుత్తేదారుల బిల్లు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు.

mulugu collector inspected medaram works quality and suspended two officers
'మేడారం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే'
author img

By

Published : Jan 10, 2020, 2:45 PM IST

'మేడారం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే'

మేడారం జాతర పనులను నాణ్యతలేమిపై పరిశీలనకు ఇంఛార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కన్నెపల్లి-ఊరట్టం రోడ్డును పరిశీలించిన పాలనాధికారి పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ రమేశ్​ను సస్పెండ్ చేశారు. డీఈ రవీందర్, ఈఈ రాంబాబులకు సంజాయిషీ నోటీసులు జారీ చేశారు.

తాత్కాలిక పనులతోపాటు, శాశ్వత నిర్మాణంలోనూ నాణ్యతలేని మెటల్ వేస్తుండటాన్ని ఈనాడు-ఈటీవీ భారత్​ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నెల 9న ఈనాడు-ఈటీవీ భారత్​ ప్రచురించిన 'మేడారం పనులు తారుమారు' కథనంపై స్పందించిన కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టారు.

కన్నెపల్లి రోడ్డు గుత్తేదారులకు బిల్లులు నిలిపివేయాలని, ఇప్పటికే బిల్లులు చెల్లించి ఉంటే రికవర్ చేపట్టాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు పలు తాత్కాలిక నిర్మాణాలు పరిశీలించారు. నాసిరకంగా ఉన్న వాటిని తొలగించి తిరిగి నిర్మించాలని ఆదేశించారు.

పనుల నాణ్యతను పరిశీలించేందుకు విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మేడారం జాతర పనులను అంకితభావంతో చేపట్టాలని, నిర్లక్ష్యం, నాణ్యత లేమితో చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Intro:tg_wgl_51_10_medaram_panulanu_parsheelinchina_collector_av_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో నాణ్యతా లోపాలతో జరిగిన ఊరట్టం కన్నెపల్లి రోడ్డును ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. తారు రోడ్డు పై గడ్డి ఎలా మొలకెత్తింది. నాణ్యతతో చేయమని చెబితే ఇలా చేస్తారా... పనులు సరిచేయాలని ఆదేశిస్తే కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తారా, పనులపై పర్యవేక్షణ ఎక్కడ, మీపై చర్యలు తప్పవు. గుత్తేదారులకు బిల్లులు నిలిపివేయండి అంటూ ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడారం జాతర పనులను పుణ్యతలేమితో తేల్చి వేస్తున్న తీరుపై కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. కన్నెపల్లి ఊరట్టం రోడ్డును పరిశీలించి పర్యవేక్షణ లోపం గా గుర్తించి పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఈ కె రమేష్ ను సస్పెండ్ చేశారు. డి ఈ రవీందర్ ఈఈ రాంబాబు లకు సంజాయిసి నోటీసులు జారీ చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనుల్లో డొల్లతనం కలెక్టర్ సాక్షిగా బయటపడింది తాత్కాలికంగా పనులతోపాటు, శాశ్వత నిర్మణంలోను అవినీతి మెటల్ వేస్తుండటాన్ని అభివృద్ధి మెటల్ ఈనాడు ఈ టీవీ వెలుగులోకి తెచ్చింది. ఈనెల 7వ తేదీన ఈనాడు ఈ టీవీ కథనంతో తో జాతర పనులు లోని లోపాలపై ప్రచురితమైంది. దీంతో గుత్తేదారులు నాణ్యతలేని కప్పి పెట్టేందుకు పనులు ఎవరికంట మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కన్నెపల్లి ఊరట్టం రోడ్డులో గడ్డిని చెక్కి తారు పోసి చదును చేస్తున్నారు. అప్పటికే పరిశీలించిన ఏటూరునాగారం ప్రాజెక్టు అధికారి రహదారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.9వ తేదీన గురువారం మేడారం పనులు తారుమారు ఈ కథనంపై ఈనాడు ఈ టీవీ ప్రచురించింది. దీంతో కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయి తనిఖీ చేపట్టారు కన్నెపల్లి రోడ్డు గుత్తేదారులకు బిల్లులు నిలిపివేయాలని, ఇప్పటికే బిల్లులు చెల్లించి ఉంటే రికవర్ చేపట్టాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు పలు తాత్కాలిక నిర్మాణాలు పరిశీలించారు. నాసిరకంగా ఉన్న వాటిని తొలగించి తిరిగి నిర్వహించాలని ఆదేశించారు. పనుల నాణ్యతను పరిశీలించేందుకు విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అన్నారు. మేడారం జాతర పనులను అంకితభావంతో చేపట్టాలని, నిర్లక్ష్యం, నాణ్యత లేమితో చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు.

Body:ss

Conclusion:బైట్: వాసం వెంకటేశ్వర్లు ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.