ETV Bharat / state

'మహా'వస్థ: మేడారంలో తాగునీటి తండ్లాట! - samakka saralamma jatara

మేడారం వచ్చే భక్తులకు తాగునీటి సమస్యలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న అరకోర నీటి సరఫరా సదుపాయాలు ఏమూలకూ సరిపోవడం లేదు. ఎక్కడో ఒక్కటి ఉన్న చేతిపంపుల వద్దకు వెళ్ళి బిందెడు నీటికోసం చిన్నపాటి యుద్దాలే చేస్తున్నారు. గత్యంతరం లేక దుకాణాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. వారు దొరికిందే సందని... ఒక్కో క్యాన్​కు వంద రూపాయలు గుంజుతున్నారు.

drinking-water-problems-in-medaram-jathara
జాతరలో త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న భక్తజనం
author img

By

Published : Feb 6, 2020, 3:13 PM IST

జాతరలో త్రాగునీటికి ఇబ్బందులుపడుతున్న భక్తజనం

రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేడారం జాతరలో భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్రం నుండే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి లక్షల్లో భక్తులు వస్తుంటారు. అమ్మవార్ల దర్శనం కోసం దూరప్రాంతాల నుండి వచ్చిన వారు గుడారాలు వేసుకొని మూడు, నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు చేపడుతున్న నీటి సౌకర్యాలు సరిపోక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

జాతర కోసం అధికారులు కట్టించిన మంచినీటి సిమెంట్ ట్యాంక్​లు నీరు లేక వెలవెలబోతున్నాయి. అక్కడక్కడ ఉన్న చేతిపంపుల వద్ద నీటికోసం తీవ్ర పోటి నెలకొంది. గంటల కొద్ది క్యూలైన్ కట్టినప్పటికీ బిందెడు నీటి కోసం ఇతరులతో వాగ్వాదాలు, తోపులాటల వరకు పరిస్థితి వస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాంకర్ వాహనాలు ఎప్పుడో ఒక్కటి మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. బయటి దుకాణాలలో వాటర్ క్యాన్లను ఇష్టారీతి ధరల్లో అమ్ముతున్నా.. భక్తులు తప్పనిసరి పరిస్థితులలో కొనుగోలు చేస్తున్నారు.

జాతరలో ఇతరత్రా అవసరాలకు కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని భక్తులు వాపోతున్నారు. కేవలం జంపన్నవాగు పరిసరాల్లో మాత్రమే నల్లాలు ఏర్పాటు చేశారని... గతంలో కంటే కూడా ప్రస్తుత పరిస్థితి అధ్వానంగా ఉందని భక్తులు వాపోతున్నారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, అధికారులు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. దుకాణాదారులు రద్దీని బట్టి నచ్చినట్లు ధరలు పెంచుతున్నారని... వాటిని ప్రభుత్వం నియంత్రించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: మేడారం జాతరకు హెలికాప్టర్​ సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.