ములుగు జిల్లాలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యటించారు. పలు ప్రాజెక్టుల పనులను పరిశీలించారు. ములుగు జిల్లా తుపాకులగూడెం ప్రాజెక్టును స్మితా సబర్వాల్ సందర్శించారు. బండపల్లి వద్ద గల దేవాదుల ఫేస్ త్రీ ప్యాకేజీ ఇంటర్నల్ పనులను ఆమె పరిశీలించారు. రామప్ప నుంచి ధర్మసాగర్ వరకు జరుగుతున్న సొరంగం మూడో దశ పనులు పోస్టల్ పంపిణీ పనుల్లో జాప్యం జరగకుండా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాదుల సొరంగ పనుల డిజైనింగ్, పనులకు పట్టే సమయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం