రెండు రోజుల క్రితం మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినిపై లాబ్ ఇంఛార్జ్ వెంకటయ్య అత్యాచారం చేశాడు. జరిగిన అత్యాచార ఘటనపై నిందితుడు వెంకటయ్యను తక్షణమే శిక్షించాలని విద్యార్థులు తరగతులు బహిష్కరించి కళాశాల ఎదుట కూర్చొని ఆందోళన చేపట్టారు.
సుమారు 300 మంది విద్యార్థులు ధర్నాకు దిగారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. విద్యార్థులను ఆందోళన విరమించాలని సూచించగా.. వారు నిరాకరించారు. బలవంతంగా వారిని తరలించేందుకు పోలీసులను విద్యార్థులు అడ్డుకోవడంతో.. కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇదీ చూడండి: ఏపీలో అట్టుడుకుతున్న 'అమరావతి' గ్రామాలు