ETV Bharat / state

చనిపోయినోళ్లను బతికించారు.. బతికున్నోళ్లను చంపేశారు! - మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పులు

మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని మేడ్చల్​ పట్టణ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డుల వారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జాబితాను అధికారులు ప్రకటించగా.. దాంట్లో చాలా వరకు తప్పులు దొర్లాయని దుండిగల్ వాసులు ఆరోపిస్తున్నారు.

mistakes in dundigal municipality voters list
చనిపోయినోళ్లను బతికించారు.. బతికున్నోళ్లను చంపేశారు!
author img

By

Published : Jan 3, 2020, 9:40 PM IST

Updated : Jan 4, 2020, 9:23 AM IST

మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పులు దొర్లకుండా చేస్తామంటున్న అధికారుల మాట ముమ్మాటికీ తప్పని నిరూపిస్తోంది వారి తీరు. వార్డుల వారీగా కులగణను చేసినప్పటికీ.. అధికారులు తప్పులు గుర్తించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. పలు వార్డులలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, మృతిచెందిన వారికి ఓట్లు ఇవ్వడంపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఒక వార్డుకు చెందిన వారికి వేరే వార్డులో ఓట్లు ఇచ్చారంటూ ఆరోపించారు.

ఏడవ వార్డులో ఉన్న ఓ హాస్టల్​లో దాదాపు 400 మంది విద్యార్థులకు ఓట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెరాస ఓట్ల దండుకోవడం కోసమే విద్యార్థులను మభ్యపెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుండిగల్ మండల కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు.

ఎస్సీ కులానికి చెందిన వారికి బీసీలో ఓట్లు ఇవ్వడం వల్ల బరిలో దిగే అవకాశాన్ని కోల్పోయామని పలువురు ఆరోపించారు. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు, కులగణన చేసినప్పటికీ తప్పులు దొర్లడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తక్కువ సమయం ఉండటం వల్ల ఓట్ల జాబితాను సరిచేస్తారో లేదోనన్న సందిగ్ధం ఏర్పడింది. తమ వార్డుల్లో వచ్చిన ఓటర్ల వివరాలు తెలియక... తమ ఓట్లు ఎక్కడున్నాయో తెలుసుకోలేక ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఓటరు ఉండేది ఒక వార్డులో అయితే పేరు నమోదు మరో వార్డులో ఉంటోంది. వారిని ఓటు ఎలా అడగాలోనని పోటీదారులు సైతం సతమతమవుతున్నారు.

చనిపోయినోళ్లను బతికించారు.. బతికున్నోళ్లను చంపేశారు!

ఇవీ చూడండి: 'చేసింది చాలు.. నువ్వు మా వెంట రావొద్దు'

Intro:TG_HYD_29_03_DUNDIGAL MUNICIPALITY_VOTLA THAPPU_PKG_TS10011
మేడ్చల్ : దుందిగల్ మున్సిపాలిటీ
నోట్ : ముందు ఒక ఐటమ్ పంపాను..దానికి followup ఇది

Body:బైట్ : శ్రీనివాస్ రెడ్డి, దుండిగల్ మండల కాంగ్రెస్ నాయకులు(single byte సెపరేట్ గా ఉన్నతను),
బైట్ : కాంగ్రెస్ కార్యకర్తలు

Conclusion:my name : upender, 9000149830
Last Updated : Jan 4, 2020, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.