మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం శిల్పనగర్‌లో మమత ఓల్డ్ఏజ్హోమ్ మొదట ఇండిపెండెంట్ బిల్డింగ్లో ప్రారంభించారు. ఆ తర్వాత డబ్బులు తీసుకుని మానసిక రోగులను చేర్పించుకోవడం మొదలు పెట్టారు. క్రమంగా మద్యానికి బానిసైన వారు... ఇలా అందరినీ ఒకే దగ్గర ఉంచారు.
గోడు వెల్లబోసుకుంటున్న బాధితులు
మానసిక వికలాంగులను గొలుసులతో బంధించి, కర్రలతో కొడుతున్నట్లు చుట్టుపక్కల వాళ్లు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని బాధితులు పోలీసుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. ఒక్కో మానసిక వికలాంగుడికి 5వేల నుంచి 10వేల రూపాయలను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
మానసిక రోగుల అరుపులు, మహిళలకు గొలుసులు వేసిన దృశ్యాలు సామాజిక మాద్యమంలో వైరల్ కావడం వల్ల స్పందించిన కలెక్టర్ ఎంవి రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.
రెండు గదుల్లో 73 మంది
రెండు గదుల్లో 73 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మమత ఓల్డ్ ఏజ్హోమ్ సందర్శించిన మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి అక్కడి మానసిక రోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతో వృద్ధులను కాకుండా మానసిక రోగులను, మద్యం తాగేవారిని, గంజాయి తీసుకునే వారిని చేర్చుకొని... అందరినీ ఒకే దగ్గర ఉంచడం సరికాదని ఆమె నిర్వాహకులను హెచ్చరించారు. నిర్వాహకులు జాన్ రతన్ పాల్, కె భారతితో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం అక్కడ ఉన్న వృద్ధులను వేరే హోల్డ్ ఏజ్ హోమ్‌కి, మానసిక రోగులకు రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు.
- ఇవీచూడండి: దావోస్‌లో మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం