మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో జరిగిన దాడి దోపిడి కేసును పోలీసులు నెల రోజుల వ్యవధిలోనే ఛేదించారు. నలుగురి నిందితులను అరెస్టు చేసిన నర్సాపూర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ నగర పరిసరాల్లోని బాచుపల్లికి చెందిన హిమాన్ సింగ్ అనే వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేద్దామని పథకం వేసిన దర్శన్, ఆనంద్, వెంకటేష్, విజయ్‌లు పోలీసులకు చిక్కారు. బాధితుడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించగా ప్రయత్నం బెడిసికొట్టి బాధితుడి సెల్‌ఫోన్, కారు ఎత్తుకుపోయారు. చరవాణి సిగ్నల్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: యజమాని ఇంట్లో 60 లక్షలు చోరీ చేసిన దొంగల అరెస్టు