మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన శ్రీవాణి, నాగరాణి, ఇంద్ర, సంధ్యలు గ్రామీణ స్వయం ఉపాధి సంస్థలో సభ్యులు. వీరు ఐకేపీ ద్వారా సంగారెడ్డిలో 13 రోజుల శిక్షణ పొందారు. గ్రామ సంఘం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40వేల రూపాయాలను అప్పు తీసుకుని.. రెండు మిషన్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
రకరకాల సంచులు
హైదరాబాద్ కొత్తపేటలో జనపనార ముడి సరుకును విక్రయించి... ఎన్నోరకాల సంచులను తయారుచేశామని తెలిపారు. లంచ్ బ్యాగులు, పర్సులు, సెల్ఫోన్ బ్యాగ్.. ఇలా రకరకాల సంచులను కుడుతున్నట్లు వివరించారు.
ఇంటివద్దే ఉపాధి:
వాటిని సభలు, సమావేశాలు ప్రభుత్వ కార్యాలయాల అధికారుల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నామని తెలిపారు. వచ్చిన డబ్బుతో తీసుకున్న అప్పును చెల్లిస్తూ... మిగిలిన డబ్బులతో కుటుంబ అవసరాలకు వాడుతున్నామని స్పష్టం చేశారు. గతంలో కూలి పనులకు వెళ్లే వాళ్లమని... ఇప్పుడు ఇంటి వద్దనే పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నామని వివరించారు.
- ఇదీ చూడండి : అట్టుడుకుతున్న దిల్లీ... ఘర్షణల్లో 40మందికి గాయాలు